Hindi Bible | Sajeeva Vahini
Home
Hindi Bible - पवित्र बाइबल
All Books
Old Testament
Genesis - उत्पत्ति
Exodus - निर्गमन
Leviticus - लैव्यव्यवस्था
Numbers - गिनती
Deuteronomy - व्यवस्थाविवरण
Joshua - यहोशू
Judges - न्यायियों
Ruth - रूत
1 Samuel - 1 शमूएल
2 Samuel - 2 शमूएल
1 Kings - 1 राजाओं
2 Kings - 2 राजाओं
1 Chronicles - 1 इतिहास
2 Chronicles - 2 इतिहास
Ezra - एज्रा
Nehemiah - नहेम्याह
Esther - एस्तेर
Job - अय्यूब
Psalms - भजन संहिता
Proverbs - नीतिवचन
Ecclesiastes - सभोपदेशक
Song of Songs - श्रेष्ठगीत
Isaiah - यशायाह
Jeremiah - यिर्मयाह
Lamentations - विलापगीत
Ezekiel - यहेजकेल
Daniel - दानिय्येल
Hosea - होशे
Joel - योएल
Amos - आमोस
Obadiah - ओबद्याह
Jonah - योना
Micah - मीका
Nahum - नहूम
Habakkuk - हबक्कूक
Zephaniah - सपन्याह
Haggai - हाग्गै
Zechariah - जकर्याह
Malachi - मलाकी
New Testament
Matthew - मत्ती
Mark - मरकुस
Luke - लूका
John - यूहन्ना
Acts - प्रेरितों के काम
Romans - रोमियों
1 Corinthians - 1 कुरिन्थियों
2 Corinthians - 2 कुरिन्थियों
Galatians - गलातियों
Ephesians - इफिसियों
Philippians - फिलिप्पियों
Colossians - कुलुस्सियों
1 Thessalonians - 1 थिस्सलुनीकियों
2 Thessalonians - 2 थिस्सलुनीकियों
1 Timothy - 1 तीमुथियुस
2 Timothy - 2 तीमुथियुस
Titus - तीतुस
Philemon - फिलेमोन
Hebrews - इब्रानियों
James - याकूब
1 Peter - 1 पतरस
2 Peter - 2 पतरस
1 John - 1 यूहन्ना
2 John - 2 यूहन्ना
3 John - 3 यूहन्ना
Jude - यहूदा
Revelation - प्रकाशितवाक्य
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
more
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Podcast
Digital Library
Free Wallpapers
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
8
Tuesday, April 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Hindi Bible in One Year!
Deuteronomy 9
28. ఏలయనగా నీవు ఏ దేశములోనుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులుయెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను, వారిని ద్వేషించుటవలనను, అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించెనని చెప్పుకొందురేమో.
29. నీవు నీ అధికబలముచేతను నీవు చాపిన నీ బాహువుచేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలును వీరే.
1. ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దా నును దాటబోవుచున్నావు.
2. ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశ స్థులు. అనాకీయుల యెదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా.
3. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొ నుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు.
4. నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలి వేసినతరువాతనేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.
5. నీవు వారి దేశ మునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జన ముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.
6. మీరు లోబడ నొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.
7. అరణ్యములో నీవు నీ దేవు డైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాప కము చేసికొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తుదేశ ములోనుండి బయలుదేరిన దినము మొదలుకొని యీ స్థలమందు మీరు ప్రవేశించువరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి.
8. హోరే బులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను.
9. ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధనసంబంధ మైన పలకలను తీసికొను టకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.
10. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.
11. ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి
12. నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.
13. మరియు యెహోవానేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
14. నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా.
15. నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.
16. నేను చూచి నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.
17. అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టు కొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి
18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.
19. ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను.
20. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతనిమీద బహుగా కోప పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని
21. అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
22. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతుహత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి.
23. యెహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొను డని చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు.
24. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.
25. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలు వది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవామిమ్మును నశింపజేసెదననగా
26. నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితినిప్రభువా యెహోవా, నీవు నీ మహిమవలన విమోచించి బాహుబలమువలన ఐగుప్తులోనుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము.
27. నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకముచేసికొనుము. ఈ ప్రజల కాఠిన్య మునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము;
Deuteronomy 10
1. ఆ కాలమందు యెహోవామునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.
2. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
3. కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.
4. ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి
5. నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
6. ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
7. అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.
8. నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.
9. కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.
10. నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.
11. మరియు యెహోవా నాతో ఇట్లనెనుఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.
12. కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,
13. నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?
14. చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.
15. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.
16. కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి
17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
19. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.
20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.
21. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.
22. నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
Luke 12
1. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.
2. మరుగైన దేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
3. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.
4. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి.
5. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.
6. అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
7. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?
8. మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.
9. మనుష్యులయెదుట నన్ను ఎరుగనను వానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.
10. మనుష్యకుమారునిమీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు.
11. వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి,
12. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.
13. ఆ జనసమూహములో ఒకడుబోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయననడుగగా
14. ఆయన ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను.
15. మరియు ఆయన వారితోమీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలముకాదనెను.
16. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
17. అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును;
18. నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని
19. నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను.
20. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.
21. దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
22. అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.
23. ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
24. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
25. మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొనగలడు?
26. కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.
27. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను.
28. నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
29. ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
30. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.
31. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.
32. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
33. మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు
34. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
Psalms 42
7. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
8. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయననుగూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవునిగూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
9. కావున నీవేల నన్ను మరచి యున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించ వలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.
10. నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
11. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.