Hindi Bible | Sajeeva Vahini
Home
Hindi Bible - पवित्र बाइबल
All Books
Old Testament
Genesis - उत्पत्ति
Exodus - निर्गमन
Leviticus - लैव्यव्यवस्था
Numbers - गिनती
Deuteronomy - व्यवस्थाविवरण
Joshua - यहोशू
Judges - न्यायियों
Ruth - रूत
1 Samuel - 1 शमूएल
2 Samuel - 2 शमूएल
1 Kings - 1 राजाओं
2 Kings - 2 राजाओं
1 Chronicles - 1 इतिहास
2 Chronicles - 2 इतिहास
Ezra - एज्रा
Nehemiah - नहेम्याह
Esther - एस्तेर
Job - अय्यूब
Psalms - भजन संहिता
Proverbs - नीतिवचन
Ecclesiastes - सभोपदेशक
Song of Songs - श्रेष्ठगीत
Isaiah - यशायाह
Jeremiah - यिर्मयाह
Lamentations - विलापगीत
Ezekiel - यहेजकेल
Daniel - दानिय्येल
Hosea - होशे
Joel - योएल
Amos - आमोस
Obadiah - ओबद्याह
Jonah - योना
Micah - मीका
Nahum - नहूम
Habakkuk - हबक्कूक
Zephaniah - सपन्याह
Haggai - हाग्गै
Zechariah - जकर्याह
Malachi - मलाकी
New Testament
Matthew - मत्ती
Mark - मरकुस
Luke - लूका
John - यूहन्ना
Acts - प्रेरितों के काम
Romans - रोमियों
1 Corinthians - 1 कुरिन्थियों
2 Corinthians - 2 कुरिन्थियों
Galatians - गलातियों
Ephesians - इफिसियों
Philippians - फिलिप्पियों
Colossians - कुलुस्सियों
1 Thessalonians - 1 थिस्सलुनीकियों
2 Thessalonians - 2 थिस्सलुनीकियों
1 Timothy - 1 तीमुथियुस
2 Timothy - 2 तीमुथियुस
Titus - तीतुस
Philemon - फिलेमोन
Hebrews - इब्रानियों
James - याकूब
1 Peter - 1 पतरस
2 Peter - 2 पतरस
1 John - 1 यूहन्ना
2 John - 2 यूहन्ना
3 John - 3 यूहन्ना
Jude - यहूदा
Revelation - प्रकाशितवाक्य
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
more
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Podcast
Digital Library
Free Wallpapers
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
6
Sunday, April 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Hindi Bible in One Year!
Deuteronomy 4
15. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు.
16. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను
17. ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
18. నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి
19. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.
20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.
21. మరియు యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.
22. కావున నేను ఈ యొర్దాను దాటకుండ ఈ దేశముననే చనిపోదును; మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు.
23. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.
24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
25. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసి కొని, యే స్వరూపము కలిగిన విగ్రహము నైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల
26. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
27. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.
28. అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
29. అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.
30. ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల
31. నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
32. దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటె ముందుగానుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క యీ దిక్కునుండి ఆకాశముయొక్క ఆ దిక్కువరకు ఇట్టి గొప్ప కార్యము జరిగెనా? దీనివంటి వార్త వినబడెనా? అని నీవు అడుగుము
33. నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?
34. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
35. అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.
36. నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని.
37. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.
38. నీకంటె బలమైన గొప్ప జనములను నీ ముందరనుండి వెళ్ల గొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగానుండి ఐగుప్తులోనుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను.
39. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము
40. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
41. అంతకుముందొకడు పగపట్టక పరాకున తన పొరుగు వాని చంపినయెడల
42. చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పుదిక్కున, యొర్దాను ఇవతల మూడు పురములను వేరుపరచెను. అట్టివాడెవడైనను ఆ పురములలో దేని లోనికినైనను పారిపోయి బ్రదుకును.
43. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీయులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
44. మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.
45. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెలుపలికి వచ్చుచుండగా
46. యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశమందు
47. మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.
48. మోషేయు ఇశ్రాయేలీయులును ఐగుప్తులోనుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును, యొర్దాను ఇవతల ఉదయదిక్కున నున్న బాషాను రాజైన ఓగుయొక్క దేశమును, అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సీయోను కొండవరకున్న అమో రీయుల యిద్దరు రాజులదేశమును,
49. పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరచుకొనిరి.
Deuteronomy 5
1. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.
2. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను.
3. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
4. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.
5. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.
6. దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
7. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
8. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.
9. వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు
10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయ ములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను.
11. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు.
12. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.
13. ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.
14. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.
15. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.
16. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
17. నరహత్య చేయకూడదు.
18. వ్యభిచరింపకూడదు.
19. దొంగిలకూడదు.
20. నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.
21. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగు వాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిద నైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
22. ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
23. మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి
24. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి.
25. కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చనిపోదుము.
26. మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను?
27. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.
28. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని యున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే.
29. వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.
30. మీ గుడారములలోనికి తిరిగి వెళ్లుడని నీవు వారితో చెప్పుము.
31. అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.
32. వారు స్వాధీనపరచు కొనునట్లు నేను వారి కిచ్చుచున్న దేశ మందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను.
33. కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞా పించినట్లు చేయుటకు జాగ్రత్తపడవలెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను.
Luke 11
5. మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లిస్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము;
6. నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
7. అతడు లోపలనే యుండి నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?
8. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.
9. అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.
10. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
11. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?
12. కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా
13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.
14. ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
15. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.
16. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.
17. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.
18. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.
19. నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు.
20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
21. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.
22. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
23. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
24. అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
25. వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి
26. వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.
27. ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
28. ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
29. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను ఈ తరమువారు దుష్టతరము వారైయుండి సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు.
30. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.
31. దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
32. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితో కూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
Proverbs 8
32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
33. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
34. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
36. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.