Hindi Bible | Sajeeva Vahini
Home
Hindi Bible - पवित्र बाइबल
All Books
Old Testament
Genesis - उत्पत्ति
Exodus - निर्गमन
Leviticus - लैव्यव्यवस्था
Numbers - गिनती
Deuteronomy - व्यवस्थाविवरण
Joshua - यहोशू
Judges - न्यायियों
Ruth - रूत
1 Samuel - 1 शमूएल
2 Samuel - 2 शमूएल
1 Kings - 1 राजाओं
2 Kings - 2 राजाओं
1 Chronicles - 1 इतिहास
2 Chronicles - 2 इतिहास
Ezra - एज्रा
Nehemiah - नहेम्याह
Esther - एस्तेर
Job - अय्यूब
Psalms - भजन संहिता
Proverbs - नीतिवचन
Ecclesiastes - सभोपदेशक
Song of Songs - श्रेष्ठगीत
Isaiah - यशायाह
Jeremiah - यिर्मयाह
Lamentations - विलापगीत
Ezekiel - यहेजकेल
Daniel - दानिय्येल
Hosea - होशे
Joel - योएल
Amos - आमोस
Obadiah - ओबद्याह
Jonah - योना
Micah - मीका
Nahum - नहूम
Habakkuk - हबक्कूक
Zephaniah - सपन्याह
Haggai - हाग्गै
Zechariah - जकर्याह
Malachi - मलाकी
New Testament
Matthew - मत्ती
Mark - मरकुस
Luke - लूका
John - यूहन्ना
Acts - प्रेरितों के काम
Romans - रोमियों
1 Corinthians - 1 कुरिन्थियों
2 Corinthians - 2 कुरिन्थियों
Galatians - गलातियों
Ephesians - इफिसियों
Philippians - फिलिप्पियों
Colossians - कुलुस्सियों
1 Thessalonians - 1 थिस्सलुनीकियों
2 Thessalonians - 2 थिस्सलुनीकियों
1 Timothy - 1 तीमुथियुस
2 Timothy - 2 तीमुथियुस
Titus - तीतुस
Philemon - फिलेमोन
Hebrews - इब्रानियों
James - याकूब
1 Peter - 1 पतरस
2 Peter - 2 पतरस
1 John - 1 यूहन्ना
2 John - 2 यूहन्ना
3 John - 3 यूहन्ना
Jude - यहूदा
Revelation - प्रकाशितवाक्य
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
more
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Podcast
Digital Library
Free Wallpapers
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
3
Thursday, April 2025
Change Date :
Previous
|
Next
Organized from Old Testament, New Testament, Psalms & Proverbs. Read and Complete Hindi Bible in One Year!
Numbers 35
34. మీరు నివసించు దేశమును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
1. మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
2. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.
3. వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను.
4. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు
5. మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.
6. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.
7. వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువది యెనిమిది.
8. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్య వలెను.
9. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
10. మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత
11. ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొన వలెను.
12. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.
13. మీరు ఇయ్య వలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములుండవలెను.
14. వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్య వలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్య వలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును.
15. పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారి పోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమై యుండును.
16. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
17. ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
18. మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
19. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.
20. వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను.
21. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
22. అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
23. దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.
24. కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
25. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
26. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లునప్పుడు
27. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కను గొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
28. ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశము నకు తిరిగి వెళ్లవచ్చును.
29. ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.
30. ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.
31. చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
32. మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.
33. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
Numbers 36
1. యోసేపు పుత్రులవంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదుయొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషేయెదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల యెదుటను మాటలాడి యిట్లనిరి
2. ఆ దేశమును వంతు చీట్లచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని యెహోవా మా యేలినవాని కాజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్య వలెనని మా యేలినవాడు యెహోవాచేత ఆజ్ఞనొందెను.
3. అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారి నెవరినైనను పెండ్లిచేసికొనిన యెడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యమునుండి తీయబడి, వారు కలిసికొనినవారి గోత్రస్వాస్థ్యముతో కలుపబడి, మాకు వంతు చీట్లచొప్పున కలిగిన స్వాస్థ్యమునుండి విడిపోవును.
4. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్రస్వాస్థ్యము తగ్గిపోవుననగా
5. మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెనుయోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే.
6. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగావారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశ ములోనే పెండ్లి చేసికొనవలెను.
7. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.
8. మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు, ఇశ్రాయేలీయుల గోత్ర ములలో స్వాస్థ్యముగల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రవంశములోనే పెండ్లిచేసికొనవలెను.
9. స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలెను.
10. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి.
11. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లిచేసికొనిరి.
12. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసి కొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.
Luke 9
28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.
29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.
30. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.
31. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడు చుండిరి.
32. పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.
34. అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.
35. మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.
37. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.
33. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.
38. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
39. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడువాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.
40. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.
41. అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.
42. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రి కప్పగించెను.
43. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.
44. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.
45. అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
46. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
47. యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.
48. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను
49. యోహాను ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.
50. అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
52. ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని
53. ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
55. ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
56. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
Psalms 40
9. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
10. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.
11. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక
12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది.
13. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
14. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
15. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
16. నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
17. నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.